భారత సంతతికి చెందిన 29 ఏళ్ల యువకుడికి అమెరికాలో ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ ఇరవైఏళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానాను విధించింది. మైనర్లతో అశ్లీల చిత్రాలు తీసి వాటిని విక్రయించిన కేసులో ముఖేష్ ఖవాస్ అనే 29 ఏళ్ల భారత సంతతి యువకుడికి ఈ జైలు శిక్ష ఖరారైంది.
వివరాల్లోకి వెళితే.. పిట్స్‌బర్గ్‌కు చెందిన ముఖేష్ ఖవాస్ అనే 29 ఏళ్ల భారత సంతతి యువకుడు బాల, బాలికలతో అశ్లీల చిత్రాలు తీశాడు.
ముఖేష్ ఖవాస్ బాల, బాలికల లైంగిక చర్యలపై అశ్లీల చిత్రాలు తీసి వ్యాపారం చేశాడని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అటార్నీ డేవిడ్ హిక్ టన్ నిర్ధారించారు. బాలలతో లైంగిక చిత్రాలు తీయడం తీవ్ర నేరమని, ఈ కేసులో నిందితుడైన ముఖేష్ ఖవాస్‌కు 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు 765,000 డాలర్ల జరిమానాను విధిస్తూ తీర్పు వెలువరించారు.
0 comments:
Post a Comment