సెక్స్ భయాలు ఏమిటి

రతిక్రీడ విషయానికి వచ్చేసరికి పురుషుల్లో కొన్ని భయాలు, ఆందోళనలు చోటు చేసుకుంటాయి. అనుమానాలు కూడా కలుగుతాయి. తన మహిళను సంతోషపెట్టగలుగతానా లేదా అనే ఆందోళన అతన్ని పీడిస్తూ ఉంటుంది. నిజానికి, మహిళల కన్నా పురుషులు చురుగ్గా, మాటకారులుగా ఉంటారని అనుకుంటారు. రతిక్రీడ విషయంలోనూ పురుషులు అలాగే ఉంటారని భావిస్తూ ఉంటారు. అయితే, పురుషులు కూడా ఆందోళనలకు, అనవసర భయాలకు అతీతులు కారని నిపుణులు అంటున్నారు. పురుషుల్లో సాధారణంగా ఉండే భయాలు, ఆందోళనలు కొన్ని ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే దూరం చేసుకుని తన లైంగిక భాగస్వామిని రతిక్రీడలో ఓలలాడించడానికి పురుషుడికి మార్గం దొరుకుతుంది.

నపుంసకత్వ భయం పురుషుల్లో ప్రప్రథమంగా తలెత్తే భయం నపుంసకత్వం. ఆ భయమే దానికి కారణంగా మారుతుంది. నిజానికి, సాధారణ లైంగిక క్రీడ చేయడానికి అనువుగా ఉన్నప్పటికీ ఆ భయం వల్ల అతనిలో పటుత్వం తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. అది మానసికమైందే తప్ప శారీరకమైంది కాదు. పది శాతం మాత్రమే బయోలాజికల్ కారణం వల్ల నపుంసకత్వం ఏర్పడుతుందని అంటారు. పురుషుడు ఆ భయానికి దూరం జరిగితే ఫోర్ ప్లే ద్వారా, కామవాంఛ ద్వారా అంగస్తంభన దానంతటదే జరుగుతుంది.

సంతృప్తి పరచలేనేమో అనే భయం.. చాలా మంది పురుషుల్లో ఈ భయం చోటు చేసుకుంటుంది. తనతో రతిక్రీడలో పాల్గొనే మహిళను పూర్తి స్థాయిలో సంతృప్తిపరచగలనా, లేదా అనే అనుమానం అతన్ని పీడిస్తూ ఉంటుంది. పురుషుడు, స్త్రీ లైంగిక క్రీడలో సమాన భాగస్వాములమని భావించినప్పుడు ఆ భయం తొలగిపోతుంది. తన మహిళ భావాలనుి తెలుసుకోవడం ద్వారా అతను దాని నుంచి బయటపడవచ్చు.

స్వయం నియంత్రణ కోల్పోతామనే భయం... పురుషులు తన భార్యకు నిబద్ధులు కావాలని, తన భార్యను మాత్రమే ప్రేమించాలని అనుకుంటారు. ఇతర స్త్రీలను చూసినప్పుడు సంయమనాన్ని, నియంత్రణను కోల్పోతామేమోనని భయపడుతుంటారు. ఇతర స్త్రీలను మదిలోకి తెచ్చుకునే విషయంలో అపరాధ భావనకు వారు గురవుతుంటారు. దానివల్ల అతనిలో కామోద్రేక స్థాయి తగ్గే అవకాశం ఉంటుంది.

భార్యకు ఇతరులపై ఆసక్తి అనే భయం.. తన భార్య అన్ని విధాలుగా తాన సొంతమని పురుషుడు భావిస్తూ ఉంటాడు. ఆమె ఇతర పురుషుల పట్ల ఆకర్షితురాలవుతుందనే భయం కూడా చాలా మంది పురుషులును పీడిస్తూ ఉంటుంది. తాను ఆమెను సంతృప్తిపరచలేకపోతున్నాననే అనుమానం కారణంగా ఆ అనుమానం పుడుతుంది. అది పురుషుడికి సంబంధించిన భావన. దాన్ని తొలగించుకుంటే ఆమెతో శృంగార సుఖాన్ని తనివితీరా అనుభవించవచ్చు.

సాధారణంగా ఉండలేకపోతున్నామనే భయం..   తాము మామూలుగా ఉండలేకపోతున్నామా, మరొకరిలా ప్రవర్తిస్తున్నామా అనే ఆందోళన పురుషులను వేధిస్తుంది. లైంగిక ప్రవర్తనలో మామూలుగా ఉండలేకపోతున్నామనే భావన పురుషుడికి నష్టం కలిగిస్తుంది.

శీఘ్ర స్కలన భయం... శీఘ్ర స్కలనం అనేది మానసికపరమైందే. ఈ సమస్య అన్ని వయస్సుల పురుషుల్లోనూ కనిపిస్తుంది. ఆందోళన వల్ల కూడా శీఘ్ర స్కలనం జరుగుతుంది. అయితే, మెదడును నియంత్రించుకోవడం ద్వారా తగిన రీతిలో వ్యవహరిస్తే చాలా సేపు రతిక్రీడను సాగించవచ్చు.

పురుషాంగం చిన్నదనే ఆందోళన.. చాలా మంది పురుషులు తన అంగం చిన్నగా ఉందని, దానివల్ల తన లైంగిక భాగస్వామిని సుఖపెడుతానో లేదో అని భయపడుతూ ఉంటారు. మహిళలను సుఖపెట్టడానికి పురుషాంగం సైజుతో సంబంధం లేదనే విషయాన్ని పురుషులు గుర్తించాలి. లైంగిక ప్రతిస్పందనలు స్త్రీలో కలిగించడానికి వీలుగా ఆమె యోనిలో అంగాన్ని జొప్పించి ప్రయత్నిస్తే సరిపోతుంది.

Share on Google Plus

About Surekha Vani

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment

0 comments:

Post a Comment