భర్త పెట్టే బాధలు ఆ భార్య ఏ మాత్రం భరించలేకోపోయింది. రోజూ రకరకాలుగా వేధిస్తున్న భర్తను ఆమె చాలాకాలంగా సహనంతో ఓర్పుతో భరించింది. ఇక శృతి మించడంతో ఆమెలోని ఆవేశం కట్టలు తెంచుకుంది. భర్తపై సోమవారం గొడ్డలితో దాడి చేసింది. నరికి చంపేసింది. అనంతపురం జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
అనంతపురం జిల్లాలో కూడేరు మండలం ఉదిపిరి కొండ గ్రామంలో బద్రీనాథ్ తన భార్య చేతిలో హత్యకు గురయ్యాడు. చాలా కాలంగా కుటుంబంలో గొడవలు నడుస్తుండేవి. ఇంటి పనులు పూర్తిచేసుకుని వ్యవసాయ పనులకు వెళ్ళే భార్యను బద్రీ అడ్డుకుని గొడవ పడేవాడు. ఇదే క్రమంలో సోమవారం కూడా గొడవ పడ్డాడు. ఆ తర్వాత ఎవరిదారిన వారు వెళ్లారు. ఇంటికెళ్లి బద్రీనాథ్ నిద్రపోతున్నాడు. ఇదే అదునుగా భావించిన భార్య అతని తలపై గొడ్డలితో దాడి చేసింది. ఈ దాడిలో బద్రీనాథ్ అక్కడికక్కడే మరణించాడు.
0 comments:
Post a Comment