వెస్ట్ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. నెల రోజుల క్రితం జరిగిన ఓ గిరిజన మహిళ హత్య కేసులోని మిస్టరీ వీడింది. తన కోరిక తీర్చలేదన్న అక్కసుతో వరుసకు వదిన అయిన మహిళను మరిది హత్య చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
వెస్ట్ గోదావరి జిల్లా నర్సాపూర్, మహ్మద్‌నగర్ పంచాయతీ పరిధి మొండితండాకు చెందిన మూడ్ సాలి (56) అనే మహిళ పొలంలోని కూరగాయలను ప్రతిరోజూ వెంకట్రావ్‌పేటగేట్ వద్దకు వెళ్లి విక్రయించుకుంటూ జీవనం సాగిస్తోంది. రోజూ మాదిరిగానే గత నెల 8న కూరగాయలు అమ్మేందుకు వెళ్లిన సాలి రాత్రికి ఇంటికి రాలేదు. మరుసటి రోజు మధ్యాహ్నం రైస్‌మిల్ సమీపంలోని వాగులో సాలి మృతదేహాన్ని గుర్తించారు.
నిజానికి సాలిపై అదే ప్రాంతానికి చెందిన వరుసకు మరిది అయిన మూడ్ జగన్ (46) అనే వ్యక్తి కన్నేశాడు. ఈనెల 8వ తేదీన సాలి కూరగాయలు అమ్ముకుని ఒంటరిగా రోడ్డుపై నడుచుకుంటూ రావడాన్ని వ్యవసాయ పొలం వద్ద ఉన్న జగన్ గమనించాడు. ఆ సమయంలో సాలిని అడ్డగించిన జగన్ తన కోరిక తీర్చాలని బలవంత పెట్టాడు. అందుకు ఆమె నిరాకరించడంతో బలవంతంగా అక్కడే ఉన్న వాగువైపు ఎత్తుకెళ్లాడు.
అది నిర్మానుష్య ప్రాంతంతో పాటు రాత్రి కావడంతో ఆమె అరుపులు ఎవరికి విన్పించలేదు. ఆ తర్వాత రేప్ చేసేందుకు ప్రయత్నించగా సాలి ప్రతిఘటించింది. దీంతో ఆమె గొంతు పిసకడంతో అపస్మారక స్థితిలోకి జారుకుంది. ఆ తర్వాత తన కోర్కె తీర్చుకుని.. ఆమె మర్మాంగంలో కట్టె పెట్టాడు. పిమ్మట ఆమె దుస్తులతో గొంతుకు కట్టి ఊపిరాడకుండా చేశాడు. ఒకవేళ బతికి ఉండే జరిగిన విషయం తండాలో చెబుతుందని భయపడి ముఖంపై రాయితో కొట్టి చంపేసి అక్కడ నుంచి జారుకున్నాడు.
మరుసటి రోజు ఉదయం తండావాసులు మృతదేహం గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జాగిలం, క్లూస్‌టీంతో విచారణ నిర్వహించారు. ఆ జాగిలం జగన్ ఇంటివద్దకు, మృతురాలి ఇంటివద్దకు వెళ్లి ఆగింది. ఈ క్రమంలో పోలీసులు అనుమానంతో జగన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, నేరాన్ని అంగీకరించాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
0 comments:
Post a Comment